Header Banner

46వ వసంతంలో బీజేపీకి జనసేనాని హృదయపూర్వక శుభాకాంక్షలు! పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్!

  Sun Apr 06, 2025 17:37        Politics

అంధకారం అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది'.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో మాటలు ఇవి. 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌ పేయి, ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో బీజేపీ అవతరించింది. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. " భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!


చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీ.. ఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #BJPFoundationDay #BJP46Years #JanaSena #PawanKalyanTweet